విమానం ఇంజిన్‌: విమానం ఇంజిన్‌లో కాయిన్స్ వేసిన బామ్మ‌.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • చైనాలోని అన్హూయీ ప్రాంతంలోని విమానాశ్రయంలో ఘటన
  • అలా చేస్తే ప్రయాణం క్షేమంగా జరుగుతుందని భావించిన బామ్మ
  • రాత్రంతా ఎయిర్ పోర్టులోనే విమానం  

రైల్లో ప్ర‌యాణం చేస్తోన్న వేళ న‌దులు క‌న‌ప‌డితే భార‌తీయులు నీళ్ల‌లో రూపాయి నాణేలు వేయ‌డం వంటివి చేస్తుంటారు. అలా చేస్తే మంచిద‌ని భావిస్తారు. అయితే, ఓ బామ్మ ల‌క్కీ ఎయిర్ జెట్‌కు చెందిన‌ విమానం ఎక్కుతూ, ఆ విమానం ఇంజిన్‌లో కాయిన్స్ వేసిన ఘ‌ట‌న చైనాలోని అన్హూయీ ప్రాంతంలో చోటు చేసుకుంది.

కాయిన్స్ వేస్తే త‌న ప్ర‌యాణం క్షేమంగా జ‌రుగుతుంద‌న్న మూఢ‌న‌మ్మకంతో ఆమె ఇలా చేసింది. దీనిని గమనించిన తోటి ప్ర‌యాణికులు విమాన సిబ్బందికి తెలిపారు. దీంతో పరిశీలించిన సిబ్బందికి ఆ బామ్మ విసిరిన కాయిన్స్ విమానం ప‌క్కనే కింద క‌నిపించాయి.  ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే స్పందించిన ట్రాన్స్ పోర్ట్ పోలీసులు ఆ బామ్మ‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ విమానాన్ని రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ఉంచారు. ఉద‌యాన్నే ఆ విమానం ప్ర‌యాణికులతో అన్హూయీ నుంచి క‌న్మింగ్ వెళ్లింది.

ఈ ఏడాది చైనాలో ఇటువంటి ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం ఇది రెండోసారి. షాంఘై ఫుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని నెల‌ల క్రితం గంగ్జౌ పట్టణానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానం ఇంజిన్‌లో 80 ఏళ్ల బామ్మ ఇలాగే కాయిన్స్ వేసింది.

More Telugu News