ram: పోటీలేదని రామ్ అనుకుంటే విజయ్ రంగంలోకి దిగుతున్నాడు!

  • తెలుగులో విడుదల కాని 'అదిరింది' 
  • మరో వారం రోజుల్లో రిలీజ్ 
  • అదే సమయంలో 'ఉన్నది ఒకటే జిందగీ'
  • రామ్ కి పోటీగా విజయ్    

తమిళంలో విజయ్ హీరోగా చేసిన 'మెర్సెల్' సినిమా, దీపావళి కానుకగా ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన వచ్చినా అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగులో 'అదిరింది' పేరుతో ఈ సినిమాను అదే రోజున విడుదల చేయాలని నిర్మాత శరత్ మరార్ ప్రయత్నించినా కుదరలేదు. దాంతో భారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించి, ఓ వారం రోజుల తరువాతనే విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడు.

అయితే ఈ నెల 27వ తేదీన రామ్ హీరోగా 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా విడుదలవుతోంది. పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే రామ్ ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. కానీ అనుకోకుండా 'అదిరింది'తో విజయ్ రంగంలోకి దిగుతున్నాడు. రామ్ సినిమా వసూళ్లపై విజయ్ ప్రభావం ఏ స్థాయిలో వుంటుందో చూడాలి మరి.      

More Telugu News