hillary clinton: 2020 అధ్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను: హిల్ల‌రీ క్లింట‌న్‌

  • కానీ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా ఉంటా
  • ఓట‌మికి కార‌ణాలు నాకే అర్థం కావ‌ట్లేదు
  • ఇంటర్వ్యూలో వెల్ల‌డించిన హిల్ల‌రీ

అమెరికాలో గ‌త అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్‌కి గ‌ట్టి పోటీ ఇచ్చిన హిల్ల‌రీ క్లింట‌న్ 2020లో రానున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు. కానీ రాజ‌కీయాల్లో మాత్రం క్రియాశీల‌కంగా ఉంటాన‌ని ఆమె వెల్ల‌డించారు. త‌న కొత్త పుస్త‌కం `వాట్ హ్యాపెండ్‌` ప్ర‌చారంలో భాగంగా ఆమె బీబీసీ రేడియో 4 `విమెన్స్ అవ‌ర్‌` ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

`నేను అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పాల్గొన‌ను. పోటీ చేయ‌కున్నప్పటికీ, నా గొంతుకి మ‌ద్ద‌తు ప‌లికేవారు ఉన్నారు` అని హిల్ల‌రీ తెలిపారు. అయితే ఈ ఇంట‌ర్వ్యూ ప్ర‌సారం కావ‌డానికి కొన్ని గంట‌ల ముందే ట్రంప్ ఈ విష‌యం గురించి ట్వీట్ చేశాడు. `హిల్ల‌రీ 2020 అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌ని అనుకుంటున్నారా? అని న‌న్ను అడిగారు. బ‌హుశా చేయొచ్చు అని నా స‌మాధానం` అని ట్రంప్ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News