samsung: '360 డిగ్రీ' కెమెరాను ఆవిష్క‌రించిన శాంసంగ్!

  • 17 లెన్స్‌ల‌తో కెమెరా త‌యారీ
  • నెలాఖ‌రులోగా మార్కెట్లోకి
  • ఇంకా ధ‌ర వెల్ల‌డించ‌ని కంపెనీ

`360 రౌండ్‌` పేరుతో ఓ స‌రికొత్త కెమెరాను శాంసంగ్ సంస్థ ఇవాళ ఆవిష్క‌రించింది. పేరుకు త‌గ్గ‌ట్లుగానే దీని స‌హాయంతో 360 డిగ్రీల కోణంలో ఫొటోలు, ఫుటేజీ తీసుకోవ‌చ్చు. 17 లెన్స్‌లతో ఈ కెమెరాను త‌యారుచేశారు. ఇందులో 8 స్టీరియో పెయిర్ల‌ను అడ్డంగా, ఒక సింగిల్ లెన్స్‌ను నిలువుగా అమ‌ర్చారు. ఈ కెమెరా వాట‌ర్ రెసిస్టెంట్‌, డ‌స్ట్ రెసిస్టెంట్ కావ‌డంతో అవుట్‌డోర్ షూటింగ్‌ల‌కు బాగా ఉప‌యోగప‌డుతుంది.

అలాగే కూలింగ్ ఫ్యాన్ కూడా అవ‌స‌రం లేకుండా దీన్ని రూపొందించారు. ఇత‌ర కెమెరాల‌తో పోల్చిన‌పుడు ఇది త‌క్కువ బ‌రువు ఉంటుందని శాంసంగ్ వెల్ల‌డించింది. ప్రీలోడెడ్ సాఫ్ట్‌వేర్ సాయంతో చిత్రాల‌న్నింటిని క‌లిపి 360 డిగ్రీ ప్ర‌భావాన్ని ఈ కెమెరా సృష్టిస్తుంది. దీనిని ల్యాన్, యూఎస్‌బీల ద్వారా క‌నెక్ట్ చేసుకునే స‌దుపాయం ఉంది. 10 జీబీ ర్యామ్, 40 జీబీ ఇంట‌ర్నల్ మెమొరీ ఇందులో ఉన్నాయ‌ని శాంసంగ్ పేర్కొంది. ఈ నెలాఖ‌రులోగా 360 డిగ్రీ కెమెరాను మార్కెట్లోకి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంది. దీని ధ‌ర‌ను శాంసంగ్ కంపెనీ వెల్ల‌డించ‌లేదు.

More Telugu News