murders: ఆ రెండు మర్డర్ కేసులను పోలీసులు ఛేదించారిలా!

  • బైక్ వదిలి పారిపోయిన దుండగులు
  • బైక్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు
  • రెండు మర్డర్ కేసుల్లో నిందితులందరినీ అరెస్టు చేసిన పోలీసులు

విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో 2016లో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుమార్తె, మాజీ ఎంపీపీ పద్మలత ఘటన, ఈనెల 17న హత్యకు గురైన రౌడీ షీటర్ గేదెల రాజు మర్డర్ కేసు నాటకీయ పరిస్థితుల నేపథ్యంలో వెలుగు చూశాయి. ఆ వివరాల్లోకి వెళ్తే... ఈనెల 17 సాయంత్రం చోడవరం నుంచి పెందుర్తి వచ్చే దారిలో పోలీసులు డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి వరకు బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి బైక్ వదిలి పరారయ్యారు. దీంతో బైక్ గురించి పోలీసులు ఆరాతీయగా అది రౌడీ షీటర్ గేదెల రాజుదని గుర్తించారు. దీంతో అతని గురించి వాకబు చేయగా ఇంటికి రాలేదని తేలింది.

దీంతో బైక్ గురించి, గేదెల రాజు ఆచూకీ గురించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా, చోడవరం పరిసరాల్లోని గ్రామం వద్ద సగం కాలిన శవం సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గేదెల రాజు కాల్ డేటా వివరాలు, సీసీ పుటేజ్ లో గేదెల రాజు వెళ్లిన వివరాలతో దర్యాప్తు వేగాన్ని పెంచారు పోలీసులు.

దీంతో గేదెల రాజు స్నేహితుడు మహేష్ ను పట్టుకుని విచారించారు. పర్యవసానంగా మర్డర్ల మిస్టరీ వీడింది. గేదెల రాజును క్షత్రియ భేరి పత్రిక యజమాని భూపతి రాజు చంపమని డబ్బులిచ్చాడని పోలీసు విచారణలో వెల్లడించాడు. దీంతో క్షత్రియ భేరి కార్యాలయంలో మద్యం పార్టీ వుందని చెప్పి రాజును తాను తీసుకొచ్చానని, దీంతో అక్కడికి వచ్చిన రాజుతో మద్యం తాగించి, కత్తులతో పొడిచి చంపామని తెలిపాడు. ఆ తరువాత కారులో అతని మృతదేహాన్ని చోడవరం పరిసరాల్లోని గ్రామాలకు తీసుకెళ్లి, పెట్రోలు పోసి తగులబెట్టామని తెలిపారు.

ఆ వెంటనే భూపతి రాజుని అరెస్టు చేసి విచారించగా, తనకు 5 లక్షల రూపాయలు ఇచ్చి గేదెల రాజును హత్యచేయించాలని ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ రవిబాబు కోరారని, దీంతోనే తాను రాజు స్నేహితుడైన మహేష్, కిరాయి హంతకులతో మాట్లాడానని వెల్లడించారు. దీంతో అప్పటికే గేదెల రాజు, రవిబాబులిద్దరూ పద్మలత హత్య కేసులో నిందితులుగా ఉండడంతో రెండు మర్డర్ల మిస్టరీ వీడినట్టైంది. అయితే దీని వివరాలు తెలియగానే రవిబాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో రెండు మర్డర్లకు కారణం ఆయననేన్న నిర్ణయానికి పోలీసులు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన లొంగిపోయారు.

అసలు రవిబాబు వారిద్దరినీ ఎందుకు హత్య చేయించాల్సి వచ్చిందన్న వివారాలను https://www.ap7am.com/flash-news-592979-telugu.html లో చదవొచ్చు. 

More Telugu News