robo 2.0: `రోబో 2.0`లో ర‌జ‌నీ పాత్ర‌ను ఆమిర్ ఖాన్ చేయాల్సిందట!... వెల్ల‌డించిన మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌

  • ఆమిర్‌కి కాల్ చేసిన ర‌జ‌నీ
  • స్క్రిప్ట్ కూడా చ‌దివిన ఆమిర్‌
  • ర‌జ‌నీని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌ని అవ‌కాశం వ‌దులుకున్న ఆమిర్‌

శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న `రోబో 2.0` చిత్రంలో హీరోగా అసలు ర‌జ‌నీ స్థానంలో ఆమిర్ ఖాన్ చేయాల్సిందట. తాను అనారోగ్యంతో ఉన్న‌పుడు ఆమిర్ ఖాన్‌ను అడ‌గాల‌ని ర‌జ‌నీకాంత్, ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కి సూచించార‌ట‌. `2.0`కి సంబంధించిన స్క్రిప్ట్‌ను కూడా ఆమిర్ చ‌దివారు‌. కానీ స్క్రిప్ట్ చ‌దువుతున్న‌పుడు `రోబో` పాత్రలో త‌న‌కు ర‌జ‌నీకాంత్ మాత్ర‌మే క‌నిపించార‌ని, ఆయ‌న స్థానంలో త‌న‌ని ఊహించుకోలేకపోయాన‌ని, అందుకే తాను సినిమా చేయ‌లేన‌ని శంక‌ర్‌కి చెప్పిన‌ట్లు మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ తెలిపారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాలు వెల్ల‌డించారు.

`ర‌జ‌నీ సార్‌ కి, శంక‌ర్‌కి నేను పెద్ద అభిమానిని. `రోబో 2.0`లో ర‌జ‌నీ పాత్ర చేయాల‌ని శంక‌ర్ న‌న్ను అడిగారు. అది పెద్ద హిట్ట‌వుతుంద‌ని నాకు తెలుసు. అనారోగ్యం కార‌ణంగా తాను సినిమా చేయ‌లేన‌ని ఆమిర్‌ను అడ‌గాల‌ని ఆయ‌న శంక‌ర్‌తో చెప్పారు. దాని గురించి ర‌జ‌నీ సార్ నాకు కాల్ కూడా చేశారు. `రోబో` సినిమా చూడ‌టం వ‌ల్ల‌నో లేక నేను ఆయ‌న అభిమాని కావ‌డం వ‌ల్ల‌నో... స్క్రిప్ట్ చ‌దువుతున్న‌పుడు నాకు ఆయ‌న మాత్ర‌మే క‌నిపించేవారు. ఆయ‌న పాత్రలో న‌న్ను నేను ఊహించుకోలేక‌పోయా. దీంతో ఆ స్థానంలో ర‌జ‌నీ సార్‌ని ఎవ్వ‌రూ భ‌ర్తీ చేయలేర‌ని శంక‌ర్‌తో చెప్పాను` అని ఆమిర్ చెప్పాడు.

More Telugu News