nani: వచ్చే ఏడాదిలోనే నాని 'కృష్ణార్జున యుద్ధం'

  • నాని తాజా చిత్రంగా రానున్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి' 
  • ఆ తరువాత సినిమాగా 'కృష్ణార్జున యుద్ధం' 
  • దర్శకుడిగా మేర్లపాక గాంధీ 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్

ప్రస్తుతం నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టులుక్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో నాని జోడీగా సాయిపల్లవి నటిస్తోంది. ఒక వైపున ఈ సినిమా చేస్తూనే మరో వైపున 'కృష్ణార్జున యుద్ధం' షూటింగును కూడా కానిచ్చేస్తున్నాడు.

 మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే విదేశాలలో షూటింగ్ జరుపుకుని వచ్చింది. నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా ఆయన సరసన ఒక హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. గత రెండేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ వస్తోన్న నాని, వచ్చే ఏడాది ఈ సినిమాతోనే ప్రేక్షకులను పలకరించనున్నాడన్న మాట.     

More Telugu News