kerala: ముస్లిం యువకుడు - హిందూ యువతి... అన్ని వివాహాలనూ 'లవ్ జీహాద్' అనలేమన్న హైకోర్టు

  • మత మార్పిడులపై కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు
  • ప్రతి వివాహాన్నీ మత కోణంలో చూడరాదు
  • కేరళలో పెరిగిన మాతాంతర వివాహాలు

మతాంతర వివాహాలన్నీ 'లవ్ జీహాద్' అని అనలేమని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలోని ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లిళ్లు చేసుకుని వారి మతాలను మారుస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ, ఓ కేసు విచారణలో భాగంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు 'ఘర్ వాపసీ' అంటూ మతం మార్పించారని ఓ ముస్లిం యువకుడు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

అన్ని వివాహాలనూ లవ్ జీహాద్ లేదా ఘర్ వాపసీగా భావించలేమని, ప్రతి మతాంతర వివాహాన్నీ మత కోణంలో పరిశీలించరాదని జస్టిస్ వీ చిదంబరేష్, జస్టిస్ సతీష్ నినాన్ లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో తాను ఓ క్రిస్టియన్ యువకుడిని పెళ్లి చేసుకోగా, తన తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారని ఆయుర్వేద వైద్య వృత్తిలో ఉన్న ఓ యువతి కోర్టును ఆశ్రయించగా, ఆ కేసుపైనా న్యాయస్థానం విచారణ జరిపింది. కేరళ రాష్ట్రంలోనే ఈ తరహా మత మార్పిడులు, ఘర్ వాపసీలు అధికంగా జరుగుతుండటం గమనార్హం. గత ఏడాది వ్యవధిలో ఇటువంటి 90 పెళ్లిళ్లు జరిగాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి.

More Telugu News