america: ఉత్తరకొరియా వెనుక చైనా ఉంది... ఉసిగొలుపుతున్నది అదే!: అమెరికా రక్షణ పరిశోధకుడు

  • ఉత్తరకొరియా అణ్వాయుధ సామర్థ్యం వెనుక చైనా హస్తం ఉంది
  • ఆ దేశానికి సాంకేతిక సాయం అందిస్తోంది చైనాయే
  • అత్యాధునిక మొబైల్ లాంఛర్లను ఉత్తరకొరియాకు అందించిన డ్రాగన్! 

ఉత్తరకొరియా అణ్వాయుధ సామర్థ్యం వెనుక చైనా హస్తం ఉందని అమెరికా రక్షణ పరిశోధకుడు, తూర్పు ఆసియా భద్రత నిపుణుడు గోర్డాన్ చాంగ్ వెల్లడించారు. అమెరికా, ఉత్తరకొరియా మధ్య తీవ్రమైన ఉద్రిక్తకరమైన పరిస్థితులను చైనా సొమ్ము చేసుకుంటోందని అన్నారు. రెండు దేశాల మధ్య సమస్యను మరింత పెద్దగా చేసేందుకు చైనా చేయాల్సినవన్నీ చేస్తోందని ఆయన ఆరోపించారు.

ఉత్తరకొరియాకు అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాన్ని చైనా అందిస్తోందని ఆయన తెలిపారు. అమెరికాను చేరగల క్షిపణుల తయారీ వెనుక చైనా హస్తం ఉందని ఆయన తెలిపారు. ఏ పరిస్థితుల్లో అయినా సులభంగా ఉపయోగించే మొబైల్ లాంఛర్లను చైనాయే ఉత్తరకొరియాకు అందజేసిందని ఆయన తెలిపారు.

ఇన్నాళ్లూ వాటిని బంకర్లలో దాచిన ఉత్తరకొరియా ఇప్పుడు వాటిని పరీక్షిస్తోందని ఆయన తెలిపారు. ఉత్తరకొరియాతో దౌత్య బంధాలను కొనసాగిస్తున్న చైనా.. సమస్యను పరిష్కరించకుండా, అగ్నికి ఆజ్యం పోస్తోందని ఆయన మండిపడ్డారు. త్వరలో చైనాలో పర్యటించనున్న ట్రంప్ ఉత్తరకొరియాకు చెక్ పెట్టేలా చైనాపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 

More Telugu News