jiiva: ఇంట‌ర్నెట్‌తో ప్ర‌పంచం అంత‌మ‌వుతుందంటున్న జీవా.. ఆసక్తికరంగా 'కీ' టీజర్!

  • ఆక‌ట్టుకుంటున్న `కీ` తెలుగు టీజ‌ర్‌
  • టెక్నిక‌ల్, సైకాల‌జిక‌ల్‌ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన చిత్రం
  • `కంట్రోల్‌+ఆల్ట్‌+డై` ఉప‌శీర్షిక‌

రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికత కార‌ణంగా వ్య‌క్తిగ‌త జీవితం ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంద‌నే క‌థాంశంతో తెర‌కెక్కిన `కీ` చిత్రం తెలుగు టీజ‌ర్ విడుద‌లైంది. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. `రంగం` ఫేం జీవా ప్ర‌ధాన పాత్రలో న‌టించిన ఈ చిత్రం టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆకట్టుకుంటోంది.

ఇటీవ‌ల టీనేజీ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన బ్లూవేల్ గేమ్ గురించి ఈ టీజ‌ర్‌లో ప్ర‌స్తావించారు. దీన్ని బ‌ట్టి చూస్తే టెక్నాల‌జీ అతివాడ‌కం వ‌ల్ల వ‌చ్చే అన‌ర్థాల‌ను ఈ చిత్రంలో చూపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నిక్కీ గ‌ల్రాని క‌థానాయికగా న‌టించిన ఈ చిత్రానికి క‌లీస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `కంట్రోల్‌+ఆల్ట్‌+డై` ఉప‌శీర్షిక‌తో వ‌స్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌లోని డైలాగులు మ‌రింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.

More Telugu News