mehreen: మెహ్రీన్ కాస్త బరువు తగ్గితే మంచిదంటున్న ప్రేక్షకులు!

  • మెహ్రీన్ తాజా చిత్రంగా వచ్చిన 'రాజా ది గ్రేట్'
  • అన్ని ఏరియాల నుంచి వస్తోన్న సక్సెస్ టాక్ 
  • మెహ్రీన్ పై ఆడియన్స్ అభిప్రాయం 
  • రిలీజ్ కి రెడీగా ఆమె నెక్స్ట్ మూవీస్      

తెలుగు తెరకు ఈ మధ్యకాలంలో పరిచయమైన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మాయి, తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుంది. ఆ తరువాత కాస్త లేట్ గా 'మహానుభావుడు' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా ఈ సుందరికి హిట్ తెచ్చిపెట్టింది.

ఇక నిన్న విడుదలైన 'రాజా ది గ్రేట్' సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో మెహ్రీన్ కి హ్యాట్రిక్ హిట్ దక్కింది. దీపావళి తెచ్చిన హ్యాట్రిక్ హిట్ తో మెహ్రీన్ సంతోషంతో పొంగిపోతోంది. ఇక ఈ సినిమా బాగుందని చెబుతోన్న ప్రేక్షకులలో ఎక్కువమంది మెహ్రీన్ బరువు తగ్గాలని అంటున్నారు. కాస్త నాజూకుగా మారితే .. నటన విషయంలో కొంత సాధన చేస్తే ఆమెకి మంచి కెరియర్ ఉంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మెహ్రీన్ తదుపరి చిత్రాలుగా 'జవాన్' .. 'కేరాఫ్ సూర్య' త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాయి.    

More Telugu News