kamal r khan: క‌మ‌ల్ ఆర్ ఖాన్ ఖాతాను నిలిపివేసిన ట్విట్ట‌ర్‌... పీడ వ‌దిలిందంటున్న నెటిజ‌న్లు

  • పండ‌గ చేసుకుంటున్న నెటిజ‌న్లు
  • పీడ వ‌దిలిందంటూ వ్యాఖ్య‌లు
  • సినిమాల‌పై వెకిలి రివ్యూలు ఇచ్చే కేఆర్‌కే

బాలీవుడ్‌లో నెం. 1 సినీ విమ‌ర్శ‌కుడిగా త‌న‌ను తాను వ‌ర్ణించుకునే క‌మ‌ల్ ఆర్ ఖాన్ ఖాతాను ట్విట్ట‌ర్ నిలిపివేసింది. హిందీ సినిమాలు భార‌త్‌లో విడుద‌ల‌వ‌డానికి ముందే దుబాయ్‌లో ప్రీమియ‌ర్ షో చూసేసి, వెకిలి రివ్యూలు రాసే కేఆర్‌కే అకౌంట్‌ను నిలిపివేయ‌డంతో చాలా మంది సినీ ప్రియులు పండ‌గ చేసుకున్నారు. ఈ దీపావ‌ళికి ట్విట్ట‌ర్ చ‌క్క‌ని బ‌హుమ‌తినిచ్చిందంటూ వ్యాఖ్య‌లు చేశారు. ట్విట్ట‌ర్‌కి ప‌ట్టిన పీడ వ‌దిలింద‌ని, క‌లుపు మొక్క‌ల‌ను ట్విట్ట‌ర్ ఏరిపారేస్తోంద‌ని కామెంట్లు చేశారు.

ఆమిర్‌ఖాన్ సినిమా `సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌` గురించి కేఆర్‌కే ఏదైనా విమ‌ర్శించాడేమోన‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ అకౌంట్ కోసం వెతికిన‌పుడు ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. సాధార‌ణంగా ట్వీట్ల‌లో అస‌భ్య ప‌ద‌జాలాన్ని, మ‌తాల‌ను, భావజాలాల‌ను కించ‌ప‌రిచే ప‌దజాలం ఉన్న‌పుడు ట్విట్ట‌ర్ ఇలా ఖాతాల‌ను నిలిపివేస్తుంది. అంతేకాకుండా వినియోగ‌దారుల ట్వీట్ల‌ను ఎక్కువ మంది రిపోర్ట్ చేసిన‌పుడు కూడా ఖాతాల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తుంది.

More Telugu News