surabhi: అల్లు శిరీష్ మూవీ కోసం గ్లామర్ డోస్ పెంచేస్తోన్న సురభి

  • 'బీరువా' మూవీతో పరిచయమైన సురభి 
  • 'జెంటిల్ మేన్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా'లతో సక్సెస్ 
  • అల్లు శిరీష్ మూవీలో ఛాన్స్ 
  • కుర్రకారు మనసు దోచే ప్రయత్నం    

తెలుగు తెరకి 'బీరువా' సినిమాతో పరిచయమైన సురభి, ఆ తరువాత 'జెంటిల్ మేన్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' వంటి హిట్స్ ను సొంతం చేసుకుంది. అయినా ఆశించిన స్థాయిలో ఈ అమ్మాయికి అవకాశాలు రావడం లేదు. ఇంతవరకూ గ్లామర్ పరంగా ఆకట్టుకునే పాత్రలు చేయకపోవడమే అందుకు కారణమనే టాక్ వుంది. దాంతో ఆ తరహా పాత్ర కోసం సురభి కొంతకాలంగా వెయిట్ చేస్తోంది.

 రీసెంట్ గా అల్లు శిరీష్ సినిమా నుంచి ఆ తరహా పాత్ర రావడం పట్ల ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ పాత్రలో గ్లామర్ డోస్ పెంచేయడానికి ఆమె రెడీ అవుతోందని అంటున్నారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో హిట్ కొట్టిన వి.ఐ. ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. చక్కని కనుముక్కు తీరుతో ఇట్టే ఆకట్టుకునే సురభి, ఈ సినిమాతో యూత్ ను కట్టిపడేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు.    

More Telugu News