diwali: దీపావళి విషెస్ తెలిపిన డొనాల్డ్ ట్రంప్ కూతురు

  • `సాల్ ముబారక్` అని ట్వీట్ చేసిన ఇవాంక‌
  • త్వ‌ర‌లో భార‌త్ రానున్న విష‌యాన్ని గుర్తుచేసిన ఇవాంక‌
  • వైట్‌హౌస్‌లో ఘ‌నంగా దీపావ‌ళి వేడుక‌లు

దీపావ‌ళి పండగ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. మంగ‌ళ‌వారం నాడు శ్వేత‌సౌధంలోని ఓవ‌ల్ ఆఫీస్‌లో జ‌రిగిన దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్న ఆమె ఆ వేడుక ఫొటోనే పోస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. `ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనులంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు. మీ అంద‌రికీ సాల్ ముబార‌క్‌. భార‌త్ రావ‌డానికి ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాను` అని ఆమె ట్వీట్ చేసింది. వ‌చ్చే నెల హైద‌రాబాద్‌లో జ‌రగ‌నున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌ద‌స్సుకు ఆమె హాజ‌రుకానున్న సంగ‌తి తెలిసిందే. వైట్‌హౌస్‌లో జ‌రిగిన దీపావ‌ళి వేడుక‌ల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భార‌తీయ అమెరిక‌న్ ఉద్యోగులు పాల్గొన్నారు.

More Telugu News