south africa: టీమిండియాను వెనక్కి నెట్టేసిన దక్షిణాఫ్రికా.. వన్డేల్లో అగ్రస్థానం!

  • ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకిన దక్షిణాఫ్రికా
  • బంగ్లాదేశ్‌పై 104 పరుగులతో ఘన విజయం
  • రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా

వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియాను దక్షిణాఫ్రికా వెనక్కి నెట్టేసింది. బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా 52 మ్యాచుల్లో 6,244 పాయింట్లతో 120 రేటింగ్‌తో అగ్రస్థానాన్ని అలంకరించింది. 50 మ్యాచుల్లో 5,948 పాయింట్లు, 120 రేటింగ్‌తో టీమిండియా రెండో స్థానానికి పరిమితమైంది.  52 మ్యాచుల్లో 5,948 పాయింట్లు, 114 రేటింగ్‌తో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 4-1తో కైవసం చేసుకుని ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా ఇప్పుడు దక్షిణాఫ్రికా.. భారత్‌ను వెనక్కి నెట్టేసింది. కాగా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లు గెలుచుకుని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

More Telugu News