dawood ibrahim: వేలానికి మాఫియా డాన్ ఇళ్లు... అమ్ముడవుతాయా?

  • దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలానికి కేంద్రం నోటిఫికేషన్
  • మాఫియా డాన్ ఆస్తులను వేలం వేయడం మూడోసారి
  • ఆరు ఆస్తులను వేలానికి ఉంచిన కేంద్రం

మాఫియా డాన్, బొంబాయి పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆస్తులను కేంద్ర ప్రభుత్వ వేలం వేయనుంది. భారత్ లో దావూద్ కార్యకలాపాలను స్తంభింపజేయడంలో భాగంగా వీటిని వేలం వేయనున్నారు. దావూద్ ఆస్తులను వేలం వేయడం ఇది మూడో సారి. వేలానికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ముంబై, ఔరంగాబాద్ లోని ఆరు ఆస్తులను వేలానికి పెడుతున్నారు.

వాటి వివరాల్లోకి వెళ్తే... దమ్రావాలా బిల్డింగ్‌ లోని 18, 20, 25, 26, 28 నెంబర్‌ ఫ్లాట్లు, పక్మోడియా స్ట్రీట్‌, యాకూబ్‌ స్ట్రీట్‌ లోని 34, 40 నెంబర్‌ ఇళ్లను వేలానికి పెట్టారు. వీటిని దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌, సోదరి హసీనా పార్కర్లు నివాసాలుగా వినియోగించారు. వాటితో పాటు యాకూబ్‌ స్ట్రీట్‌ లోని షబ్నమ్‌ గెస్ట్‌ హౌస్‌ ను కూడా వేలం వేయనుండగా, దీని రిజర్వ్ ధరను 1.21 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. 2015లో దావూద్ కి సబంధించిన హోటల్ ను వేలం వేయగా 4.28 కోట్ల రూపాయలకు ఒక వ్యక్తి పాడుకున్నారు. అయితే ఆ మొత్తం చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. 

More Telugu News