రాజ్ తరుణ్: హీరోయిన్ బ్యాగ్ లోంచి సెల్ ఫోన్ కొట్టేస్తోన్న రాజ్ తరుణ్.. ‘రాజుగాడు’ ఫస్ట్ లుక్ విడుదల!

  • ఇటీవ‌లే ‘అంధగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన రాజ్ తరుణ్
  • సంజనారెడ్డి దర్శకత్వంలో రాజుగాడు
  • దీపావళి సందర్భంగా రాజుగాడు ఫ‌స్ట్‌లుక్

ఇటీవ‌లే ‘అంధగాడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన యువ న‌టుడు రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం ‘రాజుగాడు’ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న‌ ఈ సినిమాకు సంజనారెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. దీపావళి సందర్భంగా రాజుగాడు సినిమా ఫ‌స్ట్‌లుక్ ఈ రోజు విడుద‌లైంది. ఈ సినిమాకు రామబ్రహ్మ సుంకర నిర్మాత. రాజుగాడులో అమైరా దస్తుర్.. రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న న‌టిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ రోజు విడుద‌ల చేసిన పోస్టర్‌లో హీరో, హీరోయిన్లు క‌నిపిస్తున్నారు. అమైరా దస్తుర్‌ను కౌగిలించుకున్న రాజ్‌త‌రుణ్ మెల్లిగా ఆమె బ్యాగులోని సెల్‌ఫోన్ కొట్టేస్తున్న‌ట్లు ఈ లుక్ ఉంది. 

More Telugu News