kajal: కాజల్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అదేనట!

  • యూత్ లో కాజల్ కి తగ్గని క్రేజ్ 
  • తెలుగు .. తమిళ భాషల్లో అదే జోరు  
  • వరుసగా వస్తోన్న అవకాశాలు
  • అవే ఇష్టమైన సినిమాలు        

తెలుగు .. తమిళ భాషల్లో అగ్రకథానాయికగా కాజల్ కొనసాగుతోంది. ఈ రెండు భాషల్లోని అగ్రకథానాయకులతో కల్సి ఆమె చాలా సినిమాలను చుట్టబెట్టేసింది. ఈ నేపథ్యంలో .. "ఇంతవరకూ చేసిన సినిమాల్లో ఏది బెస్ట్"? అనే ప్రశ్న తాజాగా కాజల్ కి ఎదురైంది. తన కెరియర్లో ది బెస్ట్ అనిపించే సినిమా 'వివేగం' అని కాజల్ చెప్పింది.

 అజిత్ హీరోగా చేసిన ఈ సినిమా అక్కడ భారీ ఓపెనింగ్స్ ను సాధించిందిగానీ, బ్లాక్ బస్టర్ గా నిలవలేకపోయింది. అలాంటి సినిమా తన కెరియర్లో ది బెస్ట్ అని కాజల్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇక ఆ తరువాత స్థానాల్లో 'మిస్టర్ పెర్ఫెక్ట్' .. 'బాద్షా' .. 'నేనే రాజు నేనే మంత్రి' .. 'దో లఫ్జోంకి కహాని' సినిమాలు వున్నాయని చెప్పింది. ఇక ఇతర సినిమాల విషయానికొస్తే, మణిరత్నం 'మౌనరాగం' .. త్రివిక్రమ్ 'మన్మథుడు' చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తమిళంలో విజయ్ సరసన కాజల్ చేసిన 'మెర్సెల్' .. ఈ రోజున విడుదలైన సంగతి తెలిసిందే.            

More Telugu News