trump: ట్రంప్‌ను గ‌ద్దె దింపే ఆలోచ‌న చెప్పండి... 10 మిలియ‌న్ డాలర్లు బ‌హుమ‌తి పొందండి.. పేపర్లో ప్రకటన!

  • వాషింగ్ట‌న్ పోస్ట్ ప‌త్రిక‌లో ప్ర‌క‌ట‌న ఇచ్చిన అమెరిక‌న్‌
  • స్పంద‌న బాగుంద‌ని వెల్ల‌డి
  • ట్రంప్ ఎన్నిక‌ల్లో గోల్‌మాల్ చేశాడ‌ని ఆరోప‌ణ‌

అభిశంస‌న తీర్మానం ద్వారా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గ‌ద్దెదింపడానికి ఏదైనా ఆలోచ‌న చెబితే 10 మిలియ‌న్ డాల‌ర్లు బ‌హుమ‌తిగా ఇస్తాన‌ని ఓ అమెరిక‌న్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. ఆదివారం నాటి వాషింగ్ట‌న్ పోస్ట్ ప‌త్రిక‌లో హ‌జ్ల‌ర్ ప‌బ్లికేష‌న్స్ అధినేత లారీ ఫ్లింట్ ఈ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. మంచి ఆలోచ‌న వచ్చిన వారు త‌న‌ను సంప్ర‌దించాల‌ని ఫోన్ నెంబ‌ర్‌, ఈ-మెయిల్ ఐడీ కూడా ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు.

 ఆ ప్ర‌క‌ట‌న చూసిన వారిలో చాలా మంది త‌మ‌ను సంప్ర‌దించిన‌ట్లు, 150కి పైగా ఈ-మెయిళ్లు వ‌చ్చిన‌ట్లు లారీ ఫ్లింట్ ప్ర‌తినిధి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అధ్య‌క్ష ఎన్నిక‌లు త‌ప్పులత‌డ‌క‌గా జ‌రిగాయ‌ని, అధ్య‌క్ష ప‌ద‌వి అధిష్టించ‌డానికి అత‌ను అర్హుడు కాద‌ని లారీ ఫ్లింట్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నాడు. ఎన్నిక‌ల‌ను ర‌ష్యా ఏజెంట్లు ప్ర‌భావితం చేశార‌ని, ట్రంప్ పాల‌న విధానాలు కూడా అధ్యక్ష ప‌ద‌వికి మ‌చ్చ తీసుకువ‌స్తున్నాయ‌ని చెబుతూ కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించాడు.

More Telugu News