whatsapp: వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్‌... లైవ్ లొకేష‌న్

  • ఆవిష్కరించిన వాట్సాప్‌
  • క‌చ్చిత స్థానాన్ని తెలుసుకునే స‌దుపాయం
  • పిల్ల‌లు, మ‌హిళ‌ల‌కు ఉప‌యోగం

భార‌త‌దేశ వినియోగ‌దారుల కోసం స‌రికొత్త ఫీచ‌ర్ `లైవ్ లొకేష‌న్‌`ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. దీని సాయంతో వినియోగ‌దారులు తాము ఉన్న స్థానాన్ని త‌మ స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌తో పంచుకోవ‌చ్చు. లొకేష‌న్ పంచుకునే స‌దుపాయం ఇప్పుడు కూడా వాట్సాప్‌లో ఉంది. కాక‌పోతే ఈ లైవ్ లొకేష‌న్ ద్వారా స్థానాన్ని మ‌రింత క‌చ్చితత్వంతో పంచుకోవ‌చ్చు. అంటే స‌రిగ్గా నిల్చున్న చోటును స్నేహితులకు పంపుకోవ‌చ్చు. అంతేకాకుండా టైమ‌ర్ సెట్ చేసుకునే అవ‌కాశం కూడా ఉండ‌నుంది. దీని వ‌ల్ల మ‌న లొకేష‌న్‌ను ఎంత‌సేపు పంచుకోవాలో నిర్ణ‌యించుకోవ‌చ్చు. ఈ స‌దుపాయం వ‌ల్ల పిల్ల‌లు, మ‌హిళ‌ల‌కు మ‌రింత ఉప‌యోగం చేకూర‌నుంది. లొకేష‌న్ పంచుకోవ‌డంతో పాటు, ఎంత‌సేపు అదే స్థానంలో ఉండ‌బోతున్నారో కూడా తెలియ‌జేసే వీలుంది. ఈ వారం అప్‌డేట్‌తో ఈ స‌దుపాయం అందుబాటులోకి రానుంది.

More Telugu News