జీన్స్‌, హై హీల్స్ ధ‌రించిన మ‌లాలా... విరుచుకుప‌డిన పాకిస్థానీ నెటిజ‌న్లు

Wed, Oct 18, 2017, 01:12 PM
  • పాకిస్థానీ న‌టితో పోలిక‌లు
  • ప‌రువు తీసిందంటూ వ్యాఖ్య‌లు
  • అండ‌గా నిలిచిన ఇత‌ర దేశాల నెటిజ‌న్లు
మ‌లాలా యూసుఫ్ జాయ్‌... ఈ పేరు విన‌గానే సంప్ర‌దాయ ముస్లిం వేషధారణతో, త‌ల మీద వ‌స్త్రం ధ‌రించిన శాంతికాముక ముఖం గుర్తుకువ‌స్తుంది. అలాంటి మ‌లాలా కొత్త లుక్‌లో ఉన్న ఫొటో ఒక‌టి ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న మ‌లాలా, ఓ సాధార‌ణ లండ‌న్ యువ‌తిలాగ జీన్స్‌, జాకెట్ ధ‌రించిన ఫొటో ఒక‌టి ఇంట‌ర్నెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. బాలిక‌ల విద్య కోసం పోరాడి నోబెల్ సాధించిన ఆమె స్కిన్నీ జీన్స్‌, హై హీల్స్‌, బాంబ‌ర్ జాకెట్ ధ‌రించ‌డాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆ ఫొటోనే వైర‌ల్‌గా షేర్ చేస్తూ నానా ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

`మొద‌ట చూడ‌గానే న‌టి మియా ఖ‌లీఫా అనుకున్నా!`, `త్వ‌ర‌లోనే పాకిస్థాన్‌కి భూకంపం వ‌స్తుంది`, `ఇక ఆ త‌ల మీది వ‌స్త్రం వ‌దిలించుకునే రోజులు కూడా ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి` అంటూ కామెంట్లు చేశారు. పిచ్చిప‌ట్టింద‌ని, త‌మ దేశం ప‌రువు తీసిందని వ్యాఖ్య‌లు చేశారు. ఇత‌ర దేశాల నెటిజ‌న్లు మాత్రం ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు. అస‌భ్య కామెంట్ల‌కు గ‌ట్టిగా స‌మాధానం చెప్పారు. `మీరు ఇక మార‌రు!`, `ఆమెకు స్వేచ్ఛ‌గా బ‌తికే హ‌క్కు లేదా?`, `ఇన్నాళ్ల‌కు మ‌లాలాకు స్వాతంత్ర్యం వ‌చ్చింది!` అంటూ భ‌రోసా ఇచ్చారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad