harvey weinstein: వీన్‌స్టెయిన్ కంపెనీ బోర్డుకి రాజీనామా చేసిన హార్వీ వీన్‌స్టెయిన్‌

  • లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లే కార‌ణం
  • స్ప‌ష్టం చేసిన బోర్డు స‌భ్యులు
  • హార్వీతో ఒప్పందాల‌ ర‌ద్దుకు ప్ర‌య‌త్నిస్తున్న ఇత‌ర కంపెనీలు

మూడు ద‌శాబ్దాలుగా హాలీవుడ్ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో న‌టీమ‌ణుల‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేస్తున్నాడంటూ వ‌స్తున్న ఆరోప‌ణల కార‌ణంగా నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్, త‌న కంపెనీ వీన్‌స్టెయిన్ కంపెనీ బోర్డుకు రాజీనామా చేశాడు. ఈ విష‌యాన్ని వీన్‌స్టెయిన్ కంపెనీ బోర్డు స‌భ్యులు స్ప‌ష్టం చేశారు. వేధింపుల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో వీన్‌స్టెయిన్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వారు వెల్ల‌డించారు. ఈలోగా హార్వీ రాజీనామా స‌మ‌ర్పించాడ‌ని పేర్కొన్నారు.

అలాగే హార్వీతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు కూడా త‌మ ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకు‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. హార్వీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న `ప్రాజెక్ట్ ర‌న్అవే` టీవీ కార్య‌క్ర‌మాన్ని స్పాన్స‌ర్ చేస్తున్న టాటా మోటార్ కార్పోరేష‌న్‌, లెక్స‌స్ విభాగం హార్వీతో ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకునే యోచ‌న‌లో ఉంది. సోద‌రుడు బాబ్ వీన్‌స్టెయిన్‌తో క‌లిసి హార్వీ ఈ కంపెనీని నెల‌కొల్పాడు. అయితే బాబ్ మీద కూడా లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News