'దెబ్బతిన్న పులిలా ఎవ్వరూ వేటాడలేరు' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సల్మాన్ ఖాన్!
Wed, Oct 18, 2017, 11:45 AM
- ‘ఏక్ థా టైగర్’ కు సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’
- రా ఏజెంట్ గా సల్మాన్.. ఐఎస్ఐ ఏజెంట్ గా కత్రినా కైఫ్
- ‘టైగర్ జిందా హై’ ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సల్మాన్
ఈ నేపథ్యంలో దీపావళిని పురస్కరించుకుని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సల్మాన్ ‘టైగర్ జిందా హై’ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశాడు. ‘ఏక్ థా టైగర్’ లో సీక్రెట్ ఏజెంట్ గా కనిపించిన సల్మాన్ ఇక్కడ గన్ను పట్టుకుని కోపంగా చూస్తున్న స్టిల్ కనిపిస్తోంది. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ పై ‘దెబ్బతగిలిన పులిలా ఎవ్వరూ వేటాడలేరు’ అన్న డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకు తొలి భాగానికి దర్శకత్వం వహించిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిస్ మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.
Diwali Gift.... pasand aaya? Ab Christmas pe milna... #tigerzindahai pic.twitter.com/ZRReba4oGQ
— Salman Khan (@BeingSalmanKhan) October 18, 2017