vijaym kajal: 2500లకి పైగా థియేటర్స్ లో 'మెర్సెల్' రిలీజ్

  • విజయ్ తాజా చిత్రంగా 'మెర్సెల్' 
  • తెలుగు టైటిల్ 'అదిరింది' 
  • భారీ బడ్జెట్ .. భారీ రిలీజ్ 
  • అత్యధిక బిజినెస్ చేసిన చిత్రం  

తమిళంలో మాస్ హీరోగా విజయ్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన 'మెర్సెల్' సినిమా చేశారు. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా అక్కడ ఈ రోజున విడుదలైంది. ఒక్క తమిళంలోనే ఈ సినిమా 2500లకి పైగా థియేటర్స్ లో విడుదల కావడం విశేషం.

ఇంతవరకూ తమిళంలో ఏ సినిమా ఈ స్థాయిలో విడుదలైంది లేదు అని అంటున్నారు. రజనీ 'కబాలి' కూడా ఇంతకంటే తక్కువ థియేటర్స్ లోనే విడుదలైంది. ఇక తెలుగులో ఈ సినిమా 'అదిరింది'  పేరుతో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకోసం 330 థియేటర్స్ ను కేటాయించారు. అమెరికాలో 250 స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా .. రజనీ సినిమాలను మినహా యిస్తే, తమిళంలో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డును సృష్టించడం విశేషం.

More Telugu News