baby: 28 వారాలకే పుట్టి.. మృత్యువును జయించిన పసికందు!

  • కోల్‌కతాలోని సీఎంఆర్ఐ-సీకే బిర్లా ఆసుపత్రిలో ఘటన
  • ఆశలు వదులుకోవాలన్న వైద్యులు
  • అనూహ్యంగా బతికి బయటపడ్డ చిన్నారి

నెలలు నిండకుండానే తల్లి గర్భం నుంచి భూమిపైకొచ్చిన ఓ పసికందు వస్తూవస్తూ మృత్యువుతో పోరాడి విజయం సాధించింది. నెలలు నిండకుండానే భూమిపై అడుగుపెట్టి పలు సమస్యలతో బాధపడుతున్న ఆ చిన్నారి బతకడం కష్టమని వైద్యులు తేల్చేశారు కూడా. ఆశ్చర్యకరంగా ఆ చిన్నారి మృత్యువు కోరల్లోంచి బయటపడి అద్భుతం సృష్టించింది. కోల్‌కతాలోని సీఎంఆర్ఐ-సీకే బిర్లా ఆసుపత్రిలో జరిగిందీ ఘటన.

ఈ చిన్నారి రుషా బోస్ 960 గ్రాముల బరువుతో బలహీనంగా జన్మించింది. శ్వాసకోశ సమస్యలు చుట్టుముట్టాయి. పునరుజ్జీవన ప్రక్రియలకు చిన్నారి శరీరం స్పందించడం మానేసింది. దీంతో ఆమె బతకడం కష్టమని దాదాపు తేలిపోయింది. వైద్యులు చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారాయి. చిన్నారి ఏడవకపోవడం, పరిస్థితిలో మెరుగుదల లేకపోవడంతో వైద్యులు సైతం చేతులెత్తేశారు. రుషాను వెంటిలేటర్‌పై ఉంచాలని వైద్యులు సూచించారు.

చివరికి రుషాను ఐసీయూలోకి చేర్చిన తర్వాత బతికించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నివ్వసాగాయి. వెంటిలేటర్‌తో అవసరం క్రమంగా తగ్గింది. ఐసీయూలోని చాలామంది చిన్నారులు మృతి చెందగా రుషా మాత్రం మరణాన్ని ఎదిరించి విజేతగా నిలిచింది. ఆరు నెలల్లో మూడు కిలోల బరువు పెరిగి సాధారణ స్థితికి చేరుకున్నట్టు ఆమె తల్లి బుష్రా తెలిపింది.

More Telugu News