చిరంజీవి: అప్పుడు, చిరంజీవిని మొట్టమొదటిసారిగా చూశాం: పరుచూరి గోపాలకృష్ణ

  • మెగాస్టార్ గురించి ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ
  • ఇతను మామూలు వాడు కాదు..గొప్పవాడు కాబోతున్నాడని నాడే అనుకున్నాం
  • వ్యక్తిగా చిరంజీవి అంటే చాలా ఇష్టం

చిరంజీవిని మొట్టమొదటిసారిగా చెన్నైలోని వీనస్ లాడ్జి పక్కన 1978లో చూశానంటూ నాటి విషయాలను ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. ప్రతి మంగళవారం ‘పరుచూరి పలుకులు’ పేరిట తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియోను ఆయన పోస్ట్ చేస్తుండటం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ వారం విడుదల చేసిన వీడియోలో మెగాస్టార్ చిరంజీవితో తమ అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

‘1978లో మా సినిమా ‘చలిచీమలు’ రిలీజ్ అయిన తర్వాత, మరో సినిమాకు మాటలు రాసేందుకు మేము చెన్నై వెళ్లాం. అక్కడ వీనస్ లాడ్జిలో ఉన్నాం. అప్పుడు, వర్షం పడుతోంది. పైజామా, లాల్చీ వేసుకున్న ఓ అందమైన కుర్రాడు అటు నుంచి వెళుతున్నాడు. ‘ఈ అబ్బాయి భలే ఉన్నాడు!’ అని వేజెళ్ల సత్యనారాయణ గారు, నేను అనుకున్నాం.. ఇతను మామూలు వాడు కాదు, గొప్పవాడు కాబోతున్నాడని ఆ రోజునే అనుకున్నాం. అతనే చిరంజీవి! చిరంజీవి అంటే వ్యక్తిగా చాలా ఇష్టం. ఎందుకంటే, ఎదుటి మనిషి భావాన్ని ఆయన గౌరవిస్తారు’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News