pakistan: మళ్లీ తప్పులో కాలేసి.. నాలుక కరుచుకున్న పాకిస్థాన్

  • దేశంలోని ప్రముఖ వారసత్వ కట్టడాల వీడియోను ట్విట్టర్లో ఉంచిన పాక్
  • వీడియోలో ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రముఖ మసీదు
  • విమర్శలు గుప్పించిన నెటిజన్లు

అదేంటో కానీ... పాకిస్థాన్ ఏం చేసినా, మొదటికే మోసం వస్తోంది. ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఓ పాలస్తీనా బాధితురాలి ఫొటోను చూపించి... కశ్మీర్ లో మానవహక్కులను ఇలా హత్య చేస్తున్నారంటూ కామెంట్ చేసింది. అయితే, ఇది కశ్మీర్ కు సంబంధించిన ఫొటో కాదంటూ భారత్ అసలైన విషయాన్ని వెల్లడించింది. దీంతో, అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ కు పరువు పోయింది. దీనిపై సొంత ప్రజల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంది.

ఇప్పుడు అలాంటి తప్పిదాన్నే పాక్ మరోసారి చేసింది. పాకిస్థాన్ లోని ప్రముఖ వారసత్వ కట్టడాలను హైలైట్ చేస్తూ పాక్ ఓ వీడియోను రూపొందించింది. దీన్ని పాక్ టూరిజం శాఖ ట్విట్టర్లో అప్ లోడ్ చేసింది. అయితే, ఈ వీడియోలో ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రముఖ హజ్రత్ అలీ మసీదు కూడా ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. ఈ మసీదును 'బ్లూ మసీదు" అంటారు.  ఈ తప్పుడు వీడియోపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో, పాక్ పరువు మరోసారి మంటకలిసింది. తప్పు తెలుసుకున్న అధికారులు హుటాహుటీన వీడియోను డిలీట్ చేశారు.

More Telugu News