బుట్టా రేణుకకు పచ్చ కండువా కప్పిన చంద్రబాబు!
Tue, Oct 17, 2017, 10:40 AM

- టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
- కర్నూలు అభివృద్ధికి కట్టుబడివున్నా
- బుట్టాతో పాటు కొత్తపల్లి కూడా
బుట్టా రేణుకతో పాటు వైసీపీ నేత, సెంట్రల్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి ప్రకాశ్ రెడ్డి కూడా అధికార తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. కాగా, అనంతపురం జిల్లా కీలక నేత గుర్నాథరెడ్డి కూడా టీడీపీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, రేణుక భర్త బుట్టా నీలకంఠ గతంలోనే టీడీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర మొదలయ్యే సమయానికి పార్టీ మనోబలాన్ని దెబ్బతీసేందుకే మలివిడత ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహిస్తోందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు.