మళ్లీ రాజమౌళి సినిమాలో నటించాలని వుంది : భానుప్రియ

16-10-2017 Mon 17:20
  • నిన్నటి తరం అగ్రకథానాయికలలో భానుప్రియ ఒకరు 
  • సీనియర్ హీరోలందరితోను జోడీ
  • నాట్యప్రధానమైన చిత్రాలతో ప్రశంసలు  
అందం .. అభినయం కలగలిసిన నిన్నటితరం కథానాయికలలో భానుప్రియ ఒకరు. నాట్య ప్రధానమైన కథాంశం అనే సరికి అప్పట్లో దర్శక నిర్మాతలంతా భానుప్రియ పేరునే ముందుగా పరిశీలించేవారు. సీనియర్ హీరోలందరితోను ఆమె సినిమాలు చేసింది .. వరుస విజయాలను తన సొంతం చేసుకుంది. ఆ తరువాత ఆమె ప్రాముఖ్యత కలిగిన పాత్రలను చేస్తూ వస్తున్నారు. అలాంటి భానుప్రియ తాజాగా ఐ డ్రీమ్స్ తో తనకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

ఇప్పటి దర్శకులలో ఎవరి సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపుతారు? అనే ప్రశ్నకి భానుప్రియ తనదైన శైలిలో స్పందించారు. 'బాహుబలి' సినిమా చూసిన తరువాత మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో నటించాలనిపించిందని ఆమె అన్నారు. గతంలో ఆమె రాజమౌళి తెరకెక్కించిన 'ఛత్రపతి'లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే పూరీ జగన్నాథ్ .. త్రివిక్రమ్ .. సుకుమార్ .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాలనుందని చెప్పారు. అవకాశం వస్తే తప్పకుండా చేస్తానంటూ ఆసక్తిని కనబరిచారు.