prabhas: ప్రభాస్ పుట్టినరోజు చుట్టూ తిరుగుతోన్న పుకార్లు!

  • ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు  
  • ఆ రోజున 'సాహో' ఫస్టులుక్ రిలీజ్ 
  • ఆ తరువాత సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ 
  • పెళ్లి గురించిన ప్రకటన వచ్చే ఛాన్స్        

ప్రభాస్ కి హంగులూ .. ఆర్భాటాలు నచ్చవు. వాటికి ఆయన చాలా దూరంగా ఉంటూ ఉంటాడు. కానీ ఈ సారి మాత్రం ఆయన పుట్టినరోజు వేడుక కాస్త సందడిగానే జరిగేలా కనిపిస్తోంది. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఆ రోజున 'సాహో' సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.

 ఈ ప్రాజెక్టు తరువాత ఆయన రాధాకృష్ణ కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ ఆ రోజున జరగనుందని అంటున్నారు. ఇక కరణ్ జోహార్ తో చేయనున్న బాలీవుడ్ మూవీకి సంబంధించిన ప్రకటన కూడా ఆ రోజున వెలువడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇక ఈ పుట్టినరోజున .. ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఎనౌన్స్ మెంట్ కూడా వుండొచ్చుననే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ పుట్టినరోజు ప్రభాస్ అభిమానులకు పండుగరోజు కానుందనే అనిపిస్తోంది.         

More Telugu News