samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అదే బెస్ట్ మేరేజ్ గిఫ్ట్ అంటున్న సమంత!
  • 23కి వాయిదా పడిన 'ఆక్సిజన్' ఆడియో వేడుక 
  • హీరోగా సంగీత దర్శకుడి తనయుడు 
  • బోయపాటి దర్శకత్వంలో చరణ్

*  'రాజుగారి గది 2' చిత్రం విజయం సాధించడం అన్నది తనకొచ్చిన అత్యుత్తమ మేరేజ్ గిఫ్టు అని చెప్పింది సమంత అక్కినేని. 'ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని హిట్ చేసి,  నాకు మంచి వివాహ కానుక ఇచ్చినట్టుగా భావిస్తున్నాను' అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
*  గోపీచంద్ హీరోగా నటించిన 'ఆక్సిజన్' చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 23న హైదరాబాదులో నిర్వహిస్తారు. వాస్తవానికి నిన్న నెల్లూరులో ఈ వేడుక జరగాల్సి వుంది. అయితే, వాతావరణం సరిగా లేనందున వాయిదా వేశారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అనూ ఇమ్మానుయేల్ కథానాయికలుగా నటించారు.
*  ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు, దివంగత శ్రీ తనయుడు రాజేష్ హీరోగా మారుతున్నాడు. 'శివకాశిపురం' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. హరీష్ వట్టికూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.
*  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుంది. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం చరణ్ 'రంగస్థలం 1985' చిత్రంలో నటిస్తున్నాడు.      

More Telugu News