mithali raj: మిథాలీ రాజ్ పేరు మ‌ర్చిపోయిన ఆమిర్ ఖాన్‌!

  • ఉప్ప‌ల్ మైదానంలో ఫ‌న్నీ సంఘ‌ట‌న‌
  • భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ ఎవ‌ర‌ని అడిగిన యాంక‌ర్‌
  • పేరు తెలుసుగానీ, మ‌ర్చిపోయాన‌న్న ఆమిర్‌

త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న త‌న చిత్రం `సీక్రెట్ సూప‌ర్‌స్టార్‌` ప్రచార కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్న ఆమిర్, కోహ్లీ ఆహ్వానం మేర‌కు నిన్న భార‌త్-ఆస్ట్రేలియా మ‌ధ్య చివ‌రి టీ20 మ్యాచ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన `దంగ‌ల్‌` ఫేం జైరాతో క‌లిసి ఆయ‌న వ‌చ్చారు. మైదానంలో సంద‌డి చేసిన వారిద్ద‌రినీ క్రికెట్ వ్యాఖ్యాత జ‌తిన్ స‌ప్రూ కొన్ని ప్ర‌శ్న‌లు అడిగాడు.

వాటిలో `భార‌త మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ ఎవ‌రు?` అనే ప్ర‌శ్న‌కు ఆమిర్ స‌మాధానం చెప్ప‌లేక‌పోయాడు. `ఆమె పేరు తెలుసుగానీ, ఇప్పుడు గుర్తురావ‌డం లేదు` అన్నాడు. జైరా కూడా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌లేక‌పోయింది. అప్ప‌టికీ స‌ప్రూ వారికి కొన్ని హింట్లు ఇచ్చాడు. అయిన‌ప్ప‌టికీ ఆమిర్ స‌మాధానం చెప్ప‌లేక‌పోవడం విశేషం.

More Telugu News