బాలకృష్ణ 102వ మూవీకి ఓకే చెప్పేసిన రెజీనా!

14-10-2017 Sat 12:58
  • షూటింగ్ దశలో బాలకృష్ణ 102వ చిత్రం 
  • దర్శకుడిగా కేఎస్ రవికుమార్ 
  • కథానాయికలుగా నయనతార, నటాషా దోషి    
బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రధాన కథానాయికగా నయనతార నటిస్తుండగా, మరో కథానాయిక పాత్రను నటాషా దోషి పోషిస్తోంది. ఈ నేపథ్యంలో మరో హీరోయిన్ పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ ను సంప్రదించారట. కారణమేంటో తెలియదు గానీ .. ఆమె ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందనే టాక్ వచ్చింది.

 ఇక రెజీనాను సంప్రదించగా ఆమె కూడా పెద్దగా ఆసక్తిని చూపలేదనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత మనసు మార్చుకుందో ఏమో గానీ, ఈ సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రెజీనాకు, ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి.