paruchuri gopalakrishna: 'అర్జున్ రెడ్డి'కి కొత్తదనాన్ని తెచ్చిన పాయింట్ అదే : పరుచూరి గోపాలకృష్ణ

  • 'అర్జున్ రెడ్డి' గురించి స్పందించిన పరుచూరి గోపాలకృష్ణ
  • కులం - అంతరం అనే అంశాలు 'దేవదాసు'లోను వున్నాయి
  • కథాంశాల్లో పోలిక వున్నా కథా విస్తరణలో తేడా వుంది
  • 'అర్జున్ రెడ్డి' క్లైమాక్స్ అనూహ్యం  

'పరుచూరి పాఠాలు' అనే కార్యక్రమం ద్వారా 'అర్జున్ రెడ్డి' సినిమాపై రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. కులం .. అంతరం అనే అంశం 'అర్జున్ రెడ్డి' సినిమాలోనే కాదు, నాటి 'దేవదాసు' సినిమాలోనూ ఉందంటూ, కథాపరంగా ఈ రెండు సినిమాలకి గల పోలికలను గురించి ఆయన ప్రస్తావించారు. 'దేవదాసు' శరత్ నవల కనుక .. ముగింపు ఏమిటనేది తెలిసిపోతుందనీ, 'అర్జున్ రెడ్డి' ముగింపును అనూహ్యంగా మలచడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టిందని ఆయన చెప్పారు.

 ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకోలేక తాగుడికి బానిసై 'దేవదాసు' చనిపోతాడనీ, తాగుడికి బానిసైనా తిరిగి దాని నుంచి బయటపడి ప్రేమించిన అమ్మాయిని సాధించుకోవడం 'అర్జున్ రెడ్డి'లో కనిపిస్తుందని చెప్పారు. ఈ పాయింటే ఈ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కులం .. అంతరం అనే అంశాలు ఈ రెండు సినిమాల్లో కనిపించినా .. కథా విస్తరణ జరిగిన తీరు వేరంటూ చెప్పుకొచ్చారు.  

More Telugu News