jonna vithila: సుప్రీంకోర్టు అలా చెప్పలేదు: కంచ ఐలయ్య పుస్తకంపై జొన్నవిత్తుల

  • మరోవాదన వినిపించిన జొన్నవిత్తుల
  • ఆ పుస్త‌కాన్ని భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ కింద రాసుకున్నార‌ని సుప్రీంకోర్టు చెప్పింది
  • ఆ పుస్తకంలో రాసిందంతా య‌థార్థం అని ఎక్క‌డా చెప్ప‌లేదు

ప్రొ.కంచ ఐల‌య్య రాసిన ‘సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు’ పుస్త‌కంపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన సినీగేయ ర‌చ‌యిత జొన్న‌విత్తుల రామలింగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ... ఆ పుస్త‌కంలో ఉన్న సారాంశాన్ని పిటిష‌న‌ర్లు స‌రైన విధంగా న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్ల‌లేద‌ని తాను అనుకుంటున్న‌ట్లు తెలిపారు. అలాగే, ఆ పుస్త‌కాన్ని భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ కింద రాసుకున్నార‌ని సుప్రీంకోర్టు చెప్పింది కానీ, ఆ పుస్తకంలో రాసిందంతా య‌థార్థం అని ఎక్క‌డా చెప్ప‌లేద‌ని అన్నారు. ఐల‌య్య పుస్త‌కం రాసిన విధానం భావ‌స్వేచ్ఛ ప‌రిధిలో ఉన్న‌ద‌ని మాత్ర‌మే చెప్పింద‌ని వ్యాఖ్యానించారు.

అందులో భావం.. కులాల‌ను, మ‌తాల‌ను అవ‌హేళ‌న చేసేలా ఉంద‌ని జొన్నవిత్తుల చెప్పారు. దీంట్లో ఉన్న విష‌యాల‌ని స్ప‌ష్టంగా సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళితే, దీనివ‌ల్ల విద్వేషాలు చెల‌రేగుతున్నాయ‌ని పిటిష‌నర్లు స‌రిగా చెబితే అప్పుడు సుప్రీంకోర్టు భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ విష‌యం అంటూ కాకుండా వేరే కోణంలో విచారణ జ‌రిపేద‌ని అన్నారు.

More Telugu News