కంచ ఐలయ్య: సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు : కంచ ఐలయ్య

  • ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకంపై నిషేధం పిటిషన్ కొట్టివేత 
  • సంతోషం వ్యక్తం చేసిన కంచ ఐలయ్య
  • మరింత స్వేచ్ఛగా రచనలు చేసే అవకాశం లభించింది

మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలు అయిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంచ ఐలయ్య మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఈ తీర్పు ద్వారా మరిన్ని రచనలు చేసే అవకాశం కోర్టు తనకు కల్పించిందని సంతోషం వ్యక్తం చేశారు.

కులాల చరిత్ర, సంస్కృతిపై మరింత స్వేచ్ఛగా, రాజ్యాంగ బద్ధంగా పరిశోధనలు చేసే అవకాశం తనకు లభించిందని అన్నారు. కాగా, ఈ పుస్తకాన్ని నిషేధించాలని కోరుతూ వీరాజంనేయులు అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పుస్తకాన్ని నిషేధించడమంటే, భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకున్నట్టేనని, చట్ట పరిధిలో భావ వ్యక్తీకరణ చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం.

More Telugu News