మంత్రి లోకేశ్: ‘మా ఊర్లో రోడ్లు బాగోలేవు సర్’ అంటూ యువకుడి ట్వీట్.. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేశ్

  • ‘మీ ప్రాంతంలో ఏ సమస్యలున్నా ట్విట్టర్ లో చెప్పండి’ అన్న లోకేశ్
  • ట్విట్టర్ లో రామ‌న‌గ‌రం యువకుడి ఫిర్యాదు
  • వెంటనే స్పందించి సమస్య పరిష్కరిస్తామన్న మంత్రి

'మీ ప్రాంతంలో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే మీ పేరు, ఊరు, మండ‌లం, ఫోన్ నెంబ‌రు పేర్కొంటూ ట్విట్ట‌ర్ ద్వారా తెలపండి' అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. దీంతో నారా లోకేశ్‌కి దుర్గానాథ్ అనే యువ‌కుడు ట్వీట్ చేసి త‌మ ప్రాంతంలో స‌మ‌స్య ఉంద‌ని అన్నాడు. ‘హ‌లో స‌ర్‌.. మాది రామ‌న‌గ‌రం, చ‌ల్ల‌ప‌ల్లి మండ‌ల్, కృష్ణా జిల్లా.. రోడ్లు బాగోలేవు’ అని పేర్కొంటూ త‌న ఫోన్ నెంబ‌రుని పోస్ట్ చేశాడు. దీనిపై వెంట‌నే స్పందించిన నారా లోకేశ్.. ఆ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం త్వ‌ర‌లోనే చూపుతామ‌ని అన్నారు.

More Telugu News