జగన్: అక్రమాస్తుల కేసులో జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై విచారణ వాయిదా

  • సీబీఐ కోర్టులో జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై విచారణ
  • వచ్చేనెల 2 నుంచి పాదయాత్ర నేపథ్యంలో 6 నెలలు మినహాయింపు కోరిన జగన్
  • ఈ రోజు సీబీఐ కోర్టుకు హాజరైన జగన్

ప్రతి శుక్ర‌వారం లాగే అక్ర‌మాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు కూడా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు జ‌గ‌న్ వ‌చ్చేనెల 2 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్న నేప‌థ్యంలో, వ్యక్తిగత హాజరు నుంచి ఆరు నెలల పాటు మినహాయింపు కోరుతూ వేసిన పిటిష‌న్‌పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. అయితే, ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ను ఈ నెల 20కి వాయిదా వేస్తున్న‌ట్లు కోర్టు ప్ర‌క‌టించింది.

కాగా, జ‌గ‌న్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడ‌ద‌ని సీబీఐ ఈ రోజు ఉద‌యం కౌంట‌ర్‌ దాఖలు చేసిన విష‌యం తెలిసిందే.  

More Telugu News