nandamuri balakrishna: ఎన్టీఆర్ బయోపిక్ లో.. ఎన్టీఆర్ పాత్ర పోషించేదెవరో తెలిసిపోయింది!

  • ఎన్టీఆర్ పాత్రను పోషించనున్న బాలయ్య
  • వెల్లడించిన సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్
  • తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కనున్న చిత్రం

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా తెరకెక్కించనున్నారు. అయితే, ఇందులో ఎన్టీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణే పోషించబోతున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు.  

More Telugu News