sai dharam tej: రవితేజ సినిమాలో మెగా హీరో నటించలేదట!

  • 'రాజా ది గ్రేట్' సినిమాలో సాయి ధరమ్ నటించాడంటూ ప్రచారం
  • క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
  • సాయి నటించలేదని స్పష్టీకరణ

మాస్ మహరాజా రవితేజ హీరోగా తెరకెక్కిన 'రాజా ది గ్రేట్' సినిమా విడుదలకు సిద్ధమైంది. దీపావళి కానుకగా 18న రిలీజ్ కాబోతోంది. అయితే, ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ఓ అతిథిపాత్రను పోషించాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా యూనిట్ తో సాయి ధరమ్ తేజ్ కలసి దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై దర్శకుడు అనిల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో కేవలం రాశీఖన్నా మాత్రమే అతిథి పాత్రను పోషించిందని... సాయి సరదాగానే సెట్ కు వచ్చాడని తెలిపారు. ఆ సమయంలో తీసుకున్న సెల్ఫీనే సోషల్ మీడియాలో దర్శనమిచ్చిందని చెప్పాడు. 

More Telugu News