TRS mp letter: లేఖకు కేంద్రం స్పందించకపోతే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: టీఆర్ఎస్ ఎంపీ వినోద్

  • మూడున్నరేళ్లు అవుతోన్నా హైకోర్టు విభజన ప్ర‌క్రియ జరగడం లేదు
  • ఇంకా జాప్యం చేయడం తగదు
  • కేంద్ర స‌ర్కారు ఇచ్చిన హామీల్లో ఇప్ప‌టికీ ఎన్నో హామీలు నెర‌వేర్చ‌లేదు

రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు అవుతోన్నా, ఇప్ప‌టికీ ఉమ్మడి హైకోర్టు విభజన ప్ర‌క్రియ ముందుకు క‌ద‌ల‌డం లేద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీఆర్ఎస్‌ ఎంపీ వినోద్‌ లేఖ రాశారు. ఈ విష‌యంలో ఇంకా జాప్యం చేయడం తగదని, త‌మ‌ లేఖకు కేంద్ర స‌ర్కారు నుంచి స్పందన రాక‌పోతే వ‌చ్చే పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర స‌ర్కారు ఇచ్చిన హామీల్లో ఇప్ప‌టికీ ఎన్నో హామీలు నెర‌వేర్చ‌లేద‌ని పేర్కొన్నారు. అలాగే, నియోజక వర్గాల పెంపునకు అవసరమైతే సెక్షన్‌ 26ని సవరించాల‌ని ఆయ‌న సూచించారు.

More Telugu News