cbi special court: మినహాయింపునకు జగన్ అనర్హుడు: కోర్టుకు తెలిపిన సీబీఐ

  • తీవ్రమైన ఆర్థిక నేరమిది
  • మినహాయింపు ఇచ్చేందుకు వీల్లేదు
  • ప్రత్యేక కోర్టులో సీబీఐ
  • కాసేపట్లో నిర్ణయం

తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వ్యక్తిగత మినహాయింపును కోరేందుకు అనర్హుడని సీబీఐ, ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్ 2 నుంచి తాను పాదయాత్ర చేపట్టనున్నందున ప్రతి శుక్రవారమూ జరిగే కోర్టు విచారణ నుంచి మినహాయింపు కావాలని జగన్ కోరిన సంగతి తెలిసిందే.

దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టగా, మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. కాగా, తనకు ఆరు నెలల పాటు మినహాయింపు కావాలని జగన్ కోరగా, సీబీఐ అభ్యంతరం చెబుతూ, కోర్టు అనుమతించరాదని కోరింది. ఈ కేసులో న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంది. అంతకుముందు ఇదే విషయమై జగన్, హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ కోర్టులోనే పిటిషన్ వేసి అనుమతి తీసుకోవచ్చని సూచించిన సంగతి తెలిసిందే.

More Telugu News