brad hogg: బాహుబలి సామ్రాజ్యం ముందు ఆసీస్ క్రికెటర్ బ్రాడ్ హాగ్ పోజులు చూడండి!

  • రామోజీ ఫిలింసిటీని సందర్శించిన బ్రాడ్ హాగ్
  • పలు చిత్రాల సెట్టింగ్స్ వద్ద పోజులు
  • సందడి చేసిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ 'బాహుబలి' సామ్రాజ్యం ముందు పోజిచ్చారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉన్న వేళ, జట్టుతో పాటు ఉన్న బ్రాడ్ హాగ్, హైదరాబాద్ కు వచ్చి రామోజీ ఫిలింసిటీని సందర్శించేందుకు వచ్చారు. ఇక్కడి సెట్టింగ్స్ చూసి అచ్చెరువొందాడు.

చెన్నై ఎక్స్ ప్రెస్ షూటింగ్ నిమిత్తం వేసిన రైల్వే స్టేషన్ సెట్లో నిలిపి ఉంచిన బోగీ వద్ద లుంగీ ధరించి ఓ రెండు స్టెప్పులేశాడు. ఆపై రాజమౌళి చిత్రరాజం బాహుబలి సెట్ కు వచ్చాడు. భల్లాలదేవుడి బంగారు విగ్రహాన్ని నిలిపిన ఏడు గుర్రాల రథం సెట్ ముందు నిలబడి ఫోటోలు దిగాడు. బ్రాడ్ హాగ్ చేసిన సందడిని మీరూ చూడవచ్చు.
 

More Telugu News