rain: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

  • 24 గంటల్లో భారీ వర్షాలు
  • రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
  • నిష్క్రమించనున్న రుతుపవనాలు

రానున్న 24 గంటల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం... ప్రస్తుతం అండమాన్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, 15వ తేదీ కల్లా తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఉత్తర, మధ్య, వాయవ్య, తూర్పు భారతం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. 

More Telugu News