white widow: మోస్ట్ వాంటెడ్ బ్రిటీష్ జిహాదీ... 'వైట్ విడో'ను మట్టుబెట్టిన యూఎస్ డ్రోన్లు!

  • ఇరాక్, సిరియా సరిహద్దుల్లో హతం
  • డ్రోన్ దాడిలో జోన్స్ కుమారుడు కూడా మృతి
  • స్పష్టం చేసిన యూఎస్

దక్షిణ ఇంగ్లండ్ లో పుట్టి పెరిగి, 'వైట్ విడో'గా పేరు తెచ్చుకున్న జోన్స్, అమెరికా మానవరహిత విమానాల దాడిలో హతురాలైనట్టు తెలుస్తోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాది జునైద్ హుస్సేన్ ను వివాహం చేసుకున్న జోన్స్, 2015లో భర్త ఎన్ కౌంటర్ తరువాత, 'వైట్ విడో'గా నిలిచి తుపాకీ పట్టుకుంది.

కాగా, గురువారం తాజాగా సిరియాలో జరిగిన యూఎస్ డ్రోన్ల దాడిలో జోన్స్ సహా, ఆమె 12 ఏళ్ల కుమారుడు కూడా మరణించినట్టు 'ది సన్' న్యూస్ పేపర్ ప్రకటించింది. ఈ విషయం యూఎస్ అధికారుల నుంచి బ్రిటీష్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరిందని, ఇరాక్, సిరియా మధ్య ఉన్న సరిహద్దులో ఆమె మరణించిందని ఓ అధికారి వెల్లడించారు.

ఆమె మరణించిన ప్రదేశం నుంచి డీఎన్ఏ సేకరించే అవకాశాలు లేవని, మరణించినది మాత్రం కచ్చితంగా జోన్సేనని సమాచారం అందినట్టు అధికారులు పేర్కొన్నారు. జోన్స్, జునైద్ ల ఏకైక కుమారుడు జోజో కూడా డ్రోన్ దాడిలో మరణించాడని, తల్లి పక్కనే ఉండటంతో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. కాగా, ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు బ్రిటన్ ప్రధాని అధికార ప్రతినిధి నిరాకరించారు.

More Telugu News