Israel: యునెస్కోకు మరో ఝలక్.. బయటకొస్తున్నట్టు ప్రకటించిన ఇజ్రాయెల్!

  • అమెరికా బాటలోనే ఇజ్రాయెల్
  • యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటన
  • ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించిన నెతన్యాహు

అమెరికా బాటలోనే ఇజ్రాయెల్ కూడా నడుస్తోంది. యునెస్కో నుంచి తాము బయటకు వస్తున్నట్టు అమెరికా ప్రకటించి కొన్ని గంటలైనా కాకముందే ఇజ్రాయెల్ కూడా ఇదే విధమైన నిర్ణయాన్ని తీసుకుంది.

ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేష‌న్స్ ఎడ్యుకేష‌న‌ల్‌, సైన్‌టిఫిక్ అండ్ క‌ల్చ‌ర‌ల్ ఆర్గ‌నైజేష‌న్ (యునెస్కో) ఇజ్రాయెల్‌ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని అమెరికా ఆరోపిస్తూ తాము వైదొలుగుతున్నట్టు ప్రకటించింది.

ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా యునెస్కో నుంచి తాము తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. యునెస్కో నుంచి వైదొలగేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాల్సిందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖను నెతన్యాహు ఆదేశించారు. కాగా, యునెస్కో నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను నెతన్యాహు స్వాగతించారు.

More Telugu News