rejina casandra: బంజారాహిల్స్ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల పాఠం బోధించిన సినీ నటి రెజీనా!

  • ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ 'పెగా' ఆధ్వర్యంలో ‘పెగా టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ కార్యక్రమం
  • బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.7లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సందడి చేసిన రెజీనా
  • యానిమేషన్ సినిమా చూపించి, ఆంగ్లం బోధించిన ముద్దుగుమ్మ 

ప్రముఖ సినీనటి రెజీనా బంజారాహిల్స్‌ లోని పాఠశాలలో సందడి చేసింది. ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ 'పెగా' ఆధ్వర్యంలో ‘పెగా టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదు, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.7లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రెజీనా వెళ్లింది. అక్కడి విద్యార్థులతో ఆడి,పాడి, వారితో కలిసి ‘ఇన్‌ సైడ్‌ ఔట్‌’ అనే యానిమేషన్‌ సినిమా చూసింది.

అనంతరం ఆ సినిమాలో భావాన్ని విద్యార్ధులకు విశదీకరించింది. ఈ సందర్భంగా ఆంగ్లంలోని కిటుకులు వారికి చెప్పింది. ఇంగ్లిష్ నేర్చుకోవడం కష్టం కాదని తెలిపింది. రెజీనా రావడంతో వారంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. విద్యార్థులకు దైనందిన పాఠ్యాంశాలతో పాటు ఆటవిడుపు, ఆంగ్లంపై ఆసక్తి కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు పెగా ప్రతినిధులు తెలిపారు. 

More Telugu News