fofa u-17: నైగర్ ఫుట్ బాల్ ప్లేయర్లు ఏం షాపింగ్ చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  • కొచ్చిలో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన నైగర్ అండర్ 17 ఆటగాళ్లు
  • షాపింగ్ కోసం మేనేజర్ ను పర్మిషన్ అడిగిన ఆటగాళ్లు
  • పెద్ద షాపింగ్ మాల్ లో వదిలి పెట్టి గంట టైమ్ ఇచ్చిన మేనేజర్
  • 20 నిమిషాల్లోనే షాపింగ్ ముగించిన ఆటగాళ్లు

భారత్ లో పీఫా అండర్ 17 ఫుట్ బాల్ వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొచ్చిలో మ్యాచ్ ఆడేందుకు నైగర్ జట్టు కేరళ వెళ్లింది. భద్రత దృష్ట్యా ఆటగాళ్లను బయటికి పంపరు. దీంతో నైగర్ ఆటగాళ్లు జట్టు మేనేజర్ ను కొచ్చిలో షాపింగ్ కు టైమ్ కావాలని అడిగారు. దీంతో కోచ్, స్టాఫ్ తో మాట్లాడిన మేనేజర్ షాపింగ్ కి టైమ్ నిర్ణయించి కొచ్చిలోని ఒక పెద్ద షాపింగ్ మాల్ కు తీసుకెళ్లాడు. గేట్ దగ్గర అందర్నీ వదిలి, సరిగ్గా గంట తరువాత ఇక్కడికి చేరుకోవాలని సూచించాడు.

దీంతో ఆటగాళ్లు మాల్ మొత్తం కలియదిరిగి కేవలం 20 నిమిషాల్లోనే షాపింగ్ ముగించి మేనేజర్ చెప్పిన చోటుకి చేరుకున్నారు. అందరి చేతుల్లో బరువుగా ఉన్న పెద్ద పెద్ద కవర్లను చూసిన మేనేజర్ ఆశ్చర్యంతో అందరూ ఒకేలాంటి బ్యాగులు పట్టుకున్నారు.. ఇంతకీ ఏం కొన్నారు? అని అడిగాడు.

దీంతో వారంతా తాము కొనుక్కున్న అరటికాయల చిప్స్ చూపించారు. ఒక్కొక్క ఆటగాడు 5 కేజీల చొప్పున అరటికాయల చిప్స్ కొన్నారట. ఇవన్నీ తీసుకుని హోటల్ కు చేరిన ఆటగాళ్లను చూసిన కోచ్ టోర్నీ ముగిసేవరకు వాటిని ఓపెన్ చేయకూడదని హెచ్చరించాడు. దీంతో ఎంతో ఆశతో కొన్న చిప్స్ వారిని ఊరిస్తూ బ్యాగుల్లో మూలుగుతున్నాయి. 

More Telugu News