super market: సూపర్ మార్కెట్లో మొబైల్ ఫోన్లు... బిగ్‌బ‌జార్‌లో షియోమి స్మార్ట్ ఫోన్ అమ్మ‌కాలు

  • ఒప్పందం చేసుకున్న ఇరు కంపెనీలు
  • అమ్మ‌కానికి రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్లు
  • ఈ ఫోన్ల‌పై ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టించనున్న బిగ్‌బ‌జార్‌

సూప‌ర్ మార్కెట్‌లో త‌మ స్మార్ట్‌ఫోన్ల అమ్మ‌కాల కోసం షియోమి సంస్థ, బిగ్‌బజార్‌తో ఒప్పందం చేసుకుంది. దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా ఉన్న 240 బిగ్‌బ‌జార్ అవుట్‌లెట్ల‌లో రెడ్‌మీ 4, రెడ్‌మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్లు అమ్మ‌కానికి అందుబాటులో ఉండ‌నున్నాయి. అయితే ఆన్‌లైన్లో కొన్న దాని కంటే త‌క్కువ ధ‌ర‌కు గానీ, లేదంటే నో కాస్ట్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు క్యాష్‌బ్యాక్ వంటి ఇత‌ర ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ప్ర‌క‌టించి గానీ వినియోగదారులను సంతృప్తి ప‌రుస్తామ‌ని బిగ్‌బ‌జార్ వెల్ల‌డించింది.

దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లు అమ్మ‌నుండ‌టం ఇదే మొద‌టిసార‌ని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. ప్రారంభంలో ఆన్‌లైన్‌లో మాత్రమే ల‌భించే షియోమీ స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు 500కి పైగా ఎమ్ఐ స్టోర్ల ద్వారా కూడా ల‌భ్య‌మ‌వుతున్నాయి. వాటికి తోడు బిగ్‌బజార్ కూడా క‌లిస్తే షియోమీ ఫోన్ల అమ్మ‌కాలు పుంజుకునే అవ‌కాశం ఉంది.

More Telugu News