kangana ranaut: `మణికర్ణిక` చిత్రం కోసం కంగనా కసరత్తులు...వీడియో చూడండి

  • క‌త్తిసాములు ప్రాక్టీస్ చేస్తున్న న‌టి
  • ఝాన్సీ రాణి కథ ఆధారంగా సినిమా
  • క్రిష్ దర్శకత్వంలో కంగనా

`మ‌ణిక‌ర్ణిక - ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ` సినిమా కోసం బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతోంది. ఈ సినిమా కోసం ఆమె క‌స‌ర‌త్తులు చేస్తున్న వీడియో ఒక‌టి ఇటీవ‌ల ఇంట‌ర్నెట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇందులో రెండు క‌త్తుల‌ను ఒకేసారి తిప్పుతూ క‌త్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న కంగ‌నాను చూడొచ్చు. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కంగ‌నా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్ర పోషిస్తోంది.

ఈ సినిమాకు స్టంట్ డైరెక్ట‌ర్‌గా హాలీవుడ్‌కి చెందిన నిక్ పావెల్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న స‌మ‌క్షంలో చిత్రంలో ఇతర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న సోనూ సూద్‌, అంకిత లోఖాండే, వైభ‌వ్ త‌త్వావాడిలు కూడా క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 27, 2018న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు చిత్ర‌యూనిట్ య‌త్నిస్తోంది.

More Telugu News